ఏఎంబీలో పొలిటోస్.. జనాలు మెచ్చిన బ్రాండ్

హైదరాబాద్ లో ఇప్పుడు ఏఎంబీ మాల్ అంటే తెలియని వారు ఉండరు.. సినిమాల్లో స్టార్ హీరోగా వెలుగుతున్న మహేష్ బాబు వ్యాపార రంగంలోకి దిగి మొదలుపెట్టిన వ్యాపారమే ఈ మల్టీప్లెక్స్ రంగం. ఇందులో సినిమా థియేటర్లతోపాటు మాల్, హోటల్స్, ఫుడ్ కోర్టులు సర్వం అందుబాటులో ఉంచేసరికి ప్రజలు, సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు, వివిధ వర్గాల వారు ఇందులోకి రావడానికి ఎగబడుతున్నారు.

ఇక మహేష్ బాబు కూడా తన సినిమాలకు సంబంధించిన వేడుకలు చేస్తుండడం.. ఈ మాల్ కు సొంతంగా ప్రాముఖ్యత తెస్తుండడంతో ఏఎంబీ మాల్ కు పేరు వస్తోంది. ఇప్పుడు దీన్ని క్యాష్ చేసుకోవడానికి చాలా బ్రాండ్స్ ఇప్పుడు దీని వైపు చూస్తున్నాయి.తాజాగా ప్రముఖ ఫుడ్ ప్రాడక్ట్స్ కంపెనీ పొలిటోస్ ఏఎంబీ మాల్ లోని ఫుడ్ కోర్టులో తమ శాఖను ప్రారంభించింది. మొదలు పెట్టిన రోజే కస్టమర్లు రావడం మొదలుపెట్టడం విశేషం.

ఇప్పటికే చాలా సాఫ్ట్ వేర్ కంపెనీల్లో పొలిటోస్ ఔట్ లెట్స్ ఉండడం.. అలానే సాఫ్ట్ వేర్ ఇంజినీర్ లో ఈ బ్రాండ్ పాపులర్ అవ్వడం కూడా ఏఎంబీలో మొదలు పెట్టగానే ప్రాచుర్యం పొందడానికి కారణమైంది.

పొలిటోస్ మార్కెటింగ్ డైరెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ పొలిటోస్ చాలా బాధ్యతయుతమైన కంపెనీ అని.. సరసమైన ధరలకు, నాణ్యతతో ఆహార పదార్థాలను అందజేస్తోందని తెలిపారు. అన్ని రకాల చాలా రుచికరమైన ఆహార పదార్థాలు ఉన్నాయని.. వినియోగదారుల కోరిక వారిని సంతృప్తి పరచడమే తమకు ముఖ్యమని.. అందుకే ఈ విషయంలో రాజీపడమని ఆయన తెలిపారు. మరిన్ని ఔట్ లెట్స్ త్వరలోనే హైదరాబాద్లో చాలా చోట్ల ప్రారంభిస్తామని తెలిపారు.

అందుకే ఏఎంబీ మాల్ కి వెళ్లే వాళ్లు పొలిటోస్ వైపు ఒక లుక్ వేసి ఆ రుచిని అస్వాదిస్తే మంచిది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *