నెగటివ్‌ కామెంట్‌కు.. పూనమ్‌ దిమ్మతిరిగే కౌంటర్‌

మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని నటి పూనమ్‌ కౌర్‌ బుధవారం ఢిల్లీలోని గాంధీ స్మృతిలో నివాళులు అర్పించారు. మనం చేయగలిగిందల్లా ఆయనకు గౌరవం ఇవ్వడమే, ఈరోజు ఇక్కడ ఉన్నందుకు అనందంగా ఉంది అని, దీనికి సంబంధించి ఫోటోలను తన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు.

ఆన్‌స్టేజ్‌పై నీకసలు నటించడమే రాదు. కానీ, ఆఫ్‌ స్టేజీలో మాత్రం నటనలో చించేశావని ఎగతాళి చేస్తూ ఓ నెటిజన్‌ కామెంట్‌ పెట్టాడు. కామెంట్‌నే కాకుండా ఆ అకౌంట్‌ ఎవరిది అని పరిశీలించి మరీ పూనమ్‌ దిమ్మతిరిగే కౌంటర్‌ ఇచ్చారు. ‘సర్‌ మీ ధ్యాసంతా నెగటివిటీ మీదనే ఉంటే నాలోని పాజిటివ్‌ సైడ్‌ చూడలేరు. మీ ఒరిజినల్‌ ఐడెంటిటీని ట్విట్టర్‌లో బయట పెట్టడానికే మీకు గట్స్‌ లేవు. అలాంటిది నాపైనా, నా ఆసక్తులపైనా కామెంట్లు పెడుతున్నారు. ఆన్‌లైన్‌లో మీ ఫేక్‌ ఐడెంటిటీ నుంచి బయటకు రండి.. లేకపోతే జీవితాంతం ఓ ఫేక్‌ హిపోక్రిట్‌గా ఉండాల్సి వస్తుంది. గాడ్‌ బ్లెస్‌ యూ’ అంటూ ట్విట్‌ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *