పోలీస్ సింగంకు ఏసీబీ డీజీ పోస్టు..

ఆయన ఏపీ పోలీస్ సింగం.. అవినీతి పరుల గుండెల్లో నిద్రపోతాడు.. ట్రాన్స్ పోర్టు కమిషనర్ గా ఆయన అక్రమంగా రోడ్డురవాణా చేస్తూ దోచుకుంటున్న జేసీ బ్రదర్స్ ట్రావెల్స్ పనిపట్టి శభాష్ అనిపించుకున్నాడని కథలు కథలు చెబుతారు. కేంద్ర సర్వీసుల్లో ఉన్న ఆయనను సీఎంగా జగన్ గద్దెనెక్కాక ఏరికోరి తీసుకొచ్చారు. ఆయన నమ్మకాన్ని నిలబెడుతూ ట్రాన్స్ పోర్టు కమిషనర్ గా అవినీతి పరుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఘనుడాయన.. ఆయన ఎవరో కాదు.. సీనియర్ ఐపీఎస్, ప్రస్తుత ట్రాన్స్ పోర్టు కమిషనర్, ఏపీ ఆర్టీసీ కమిషనర్ పీఎస్సార్ ఆంజనేయులు..

ఏపీలో అవినీతి రహిత పాలన అందిస్తానని సీఎంగా గద్దెనెక్కగానే జగన్ ప్రకటించి ప్రజలకు భరోసానిచ్చారు. అయితే తన అంచనాలకు అనుగుణంగా ఏసీబీ పనిచేయడంలేదని జగన్ మథపడినట్లు తెలిసింది.రెండు రోజుల కిందటే ఏసీబీ పనితీరుపై జగన్ సమీక్ష జరిపారు. ఆ సందర్భంగా తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసిన ఆయన ఆగ్రహిస్తూనే మెరుగుపడాలంటూ కొంత సమయం ఇచ్చారు. కానీ ఏకంగా డీజీ స్థాయి అధికారిని మార్చేశారు.

ఏపీలో అవినీతిపై యుద్ధం ప్రకటించిన సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏపీ ఏసీబీ డీజీగా కుమార విశ్వజిత్ తన అంచనాలకు తగ్గట్లుగా పనిచేయడం లేదని ఆయనను బదిలీ చేశారు. పోస్టింగ్ కూడా ఇవ్వకుండా డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని కఠిన ఆదేశాలు ఇచ్చారు. ఇప్పుడు ఆయన స్థానంలో జగన్ ప్రభుత్వంలో రాష్ట్రంలో రోడ్డురవాణాలో అవినీతి అధికారులు, ప్రజాప్రతినిధుల భరతం పడుతున్న పోలీస్ సింగం.. ఐపీఎస్ పీఎస్సార్ ఆంజనేయులును తీసుకొచ్చారు. ఆంజనేయులు ప్రస్తుతం రవాణా శాఖ కమిషనర్‌గా ఉన్నారు.

అవినీతిపై యుద్ధం చేయకుండా నిరాస్తకగా ఉన్న ఏసీబీ సిబ్బందిలో మరింత సీరియస్ నెస్ పెంచేందుకు ఏకంగా ఏసీబీ డీజీ పైనే బదిలీ వేటు వేసి ఆ స్థానంలో సింగం లాంటి ఆంజనేయులుకు బాధ్యతలు అప్పజెప్పారు.

పీఎస్సార్ ఆంజనేయులు ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్‌గా తన సత్తా చాటారు. అవినీతి లేకుండా చేశారు. ప్రయివేటు ట్రావెల్స్ దందాని కట్టడి చేశారు. ఏకంగా మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కుమారుడి నుంచి కూడా రివకరీ చేయగలిగారు. జేసీ దివాకరరెడ్డి వంటి నాయకుడికి ఎదురెళ్లి నిలిచారు. దీంతో ఆయన పనితీరు నచ్చి జగన్ ఏకంగా ఆయనకు ఏసీబీ డీజీగా నియమించారు. అవినీతి రహిత పాలన అందించే లక్ష్యంతో గద్దెనెక్కిన జగన్ తన లక్ష్య సాధనకు పీఎస్సార్ ఆంజనేయులు ఉపయోగపడతారనే తీసుకొచ్చారు.

ఇక ఈయన ప్రస్తుతం రవాణా శాఖ కమిషనర్‌ గానే కాకుండా ఏసీబీ డీజీతోపాటు ఏపీపీఎస్సీ కమిషనర్ గానూ మూడు బాధ్యతలను జగన్ అప్పగించి సంచలనం సృష్టించారు. స్వతహాగానే డేరింగ్ డ్యాషింగ్ అవినీతి విషయంలో ఎవ్వరి మాట వినకుండా ముందుకు సాగే సీతయ్య లాంటి ఐపీఎస్ పీఎస్సాఆర్ ఆంజనేయులు రాకతో ఇప్పుడు అవినీతిపరులు ఉలిక్కిపడుతున్నారు. ఏపీపీఎస్సీలో అవినీతిపై కూడా ఆంజనేయులు రాకతో హతాషులయ్యారు. ఇక అందరికీ మూడినట్టే తమ మొగుడు వచ్చాడని చర్చించుకుంటున్నారట.. చూడాలి మరీ ఈ సీతయ్య కం సింగం అవినీతి పరుల విషయంలో ఎలా ముందుకెళ్తాడన్నది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *