సుజనా, రఘురామకృష్ణ.. ఇద్దరూ తోడుదొంగలేనట.. ఇవే సాక్ష్యాలట..?

జగన్ సర్కార్ కొలువుదీరిన కొత్తల్లో ఏపీ రాజకీయాల్లో రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరి హల్ చల్ చేసేవారు. ఆ తర్వాత ఆయన స్థానాన్ని నర్సాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు భర్తీ చేసేశారు. ఇద్దరూ వైసీపీపై దాడి చేయడమే లక్ష్యంగా మాటల తూటాలు పేల్చుతారని ప్రత్యర్థులు ఆడిపోసుకుంటారు.

అయితే ఇద్దరికి సంబంధించి ఒక పోలిక ఉందని తాజాగా సోషల్ మీడియాలో ఓ పోస్టు వైరల్ అవుతోంది. ఇద్దరూ ఒక పార్టీ కోసం.. లేదంటే తమ సొంత స్వార్థం కోసం అధికార వైసీపీని టార్గెట్ చేశారని సోషల్ మీడియాలో కొంతమంది ట్రోల్స్ చేస్తున్నారు. అవిప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరితోపాటు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు ఇద్దరూ ఇప్పుడు బీజేపీతో సాన్నిహిత్యం నెరుపుతున్నారు. సుజనా సడెన్ గా బీజేపీలోకి జంప్ అయ్యాడు. రఘురామ మాత్రం వైసీపీలో అసమ్మతి రాజేసి బీజేపీకి సపోర్టు చేస్తున్నారు. ఈ ఇద్దరూ బీజేపీలో చేరడానికి ప్రధాన కారణం బ్యాంక్ లతో లీగల్ ఇష్యూలు ఉండడం వల్లే అని వైసీపీ నేతలు, సోషల్ మీడియా ఫాలోవర్స్ ఆరోపిస్తున్నారు. వీరిద్దరూ బీజేపీలో చేరితే తమ అక్రమాలపై చర్యలు తీసుకోకుండా అడ్డుకోవచ్చని ఇలా బీజేపీలో చేరి సేఫ్ సైడ్ నాటకాలు ఆడుతున్నట్టు వారు విమర్శిస్తున్నారు.

ఏపీ ఎంపీలు సుజనా చౌదరి, రఘురాకృష్ణం రాజు ఆశ్చర్యకరంగా ఇద్దరూ బ్యాంకుల నుంచి అప్పు తీసుకొని ఎగ్గొట్టిన వారేనని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. 2010లో ఈస్ట్ కోస్ట్ పవర్ అనే విద్యుత్ ఉత్పత్తి సంస్థ రఘురామకృష్ణ రాజుకు ఉండేదట.. దీని మీద ఇప్పటికే ఆయన 947 కోట్ల రూపాయలను బ్యాంకులో లోన్ తీసుకున్నాడని.. కానీ తీర్చలేకపోయాడని ఓ టాక్ ఏపీ రాజకీయాల్లో ప్రచారంలో ఉంది. దాని మీద రఘురామపై న్యూఢిల్లీలోని ఎకనామిక్ ఆఫీస్ వింగ్ లో కేసు నమోదైందట.. ఈ కేసు విచారణ రావడంతో వైసీపీలో ఉంటే ఇక లాభం లేదని.. బీజేపీలో చేరి ఆ కేసులు విచారణకు రాకుండా మాఫీ చేసుకోవాలని.. బ్యాంకులకు కట్టాల్సిన వందల కోట్లు కూడా తప్పించుకోవచ్చనే కారణంతోనే రఘురామకృష్ణం రాజు బీజేపీకి దగ్గరైనట్టు ఢిల్లీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.

ఇక టీడీపీ నుంచి బీజేపీలోకి జంప్ అయిన రాజ్యసభ ఎంపీ సుజనాచౌదరికి బ్యాంకు కష్టాలు భారీగా ఉన్నాయన్న ప్రచారం సోషల్ మీడియాలో సాగుతోంది.. బరోడా బ్యాంకుకు సుజనా చౌదరి దాదాపు 322 కోట్లు బకాయిలు పడ్డాడు. వడ్డీతో కలిపి మొత్తం 400 కోట్లు అయ్యిందట.. బాకీలు చెల్లించకపోవడంతో మార్చి 23న ఈయన ఆస్తులకు వేలం వేస్తామని బ్యాంకు నోటీసులు జారీ చేసింది. పత్రికల్లోనూ నోటిఫికేషన్ ఇచ్చింది.

బ్యాంకులకు వందల కోట్లను సుజనా, రఘురామ ఎగ్గోట్టారని.. అందుకే వీరుద్దరూ బీజేపీలో చేరి నాటకాలు ఆడుతున్నారని ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా ఫాలోవర్స్ ఆరోపిస్తున్నారు. ఈ మేరకు కొన్ని ట్రోల్స్ ను విపరీతంగా షేర్ చేస్తూ ఎండగడుతున్నారు. ప్రస్తుతం బ్యాంకులకు కుచ్చుటోపి పెట్టిన సుజనా, రఘురామ బాగోతాలపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది. వైసీపీ సోషల్ మీడియా ఫాలోవర్స్ అయితే ట్రోలింగ్ చేస్తూ వారి తీరును ఎండగడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *