విమానాన్ని నడిపిన సుశాంత్‌ సింగ్‌ !.. వీడియో వైరల్‌

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ విమానాన్ని నడిపారు. అదేంటి ఎలాంటి ట్రైనింగ్‌ లేకుండానే విమానాన్ని నడిపాడనుకుంటున్నారా. అయితే ఓ సారి సుశాంత్‌ సింగ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన వీడియోను మీరు చూడాల్సిందే.

 

‘ఎగరడానికి లైసెన్స్‌ వచ్చింది.. ఈ బ్యూటీని (బోయింగ్‌ 737 ఫిక్స్‌డ్‌ బేస్‌ ఫ్లైట్‌ సిమ్యులేటర్‌) కొనుగోలు చేస్తున్నా.. నా 150 డ్రీమ్స్‌లలో మొదటిది పూర్తయింది’ అంటూ పోస్ట్‌ పెట్టారు. అయితే ఇది నిజమైన విమానమేమో అని చాలా మంది ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. అసలు విషయం ఏంటంటే.. అది కేవలం కల్పితం మాత్రమే. అదేంటి వీడియోలో విమానంలో ఉండటం, సుశాంత్‌ విమానాన్ని ఎయిర్‌ బేస్‌ నుంచి వచ్చే సూచనలతో విమానాన్ని నడపడం, అందుకు తగ్గట్టే బయట విమానం నడుస్తున్నట్టు గాల్లో ఎగురుతున్నట్టు అన్ని చక చకా జరిగిపోయాయి కదా అనుకుంటున్నారా.

అదేలాగంటే..
బోయింగ్‌​ 737 డిజైన్‌తో తయారు చేసిన క్యాబిన్‌, దానికి ముందు ఆపరేట్‌ చేస్తుంటే నడిచే స్క్రీన్‌ ఉంటుంది. ఆపరేటింగ్‌కు తగ్గట్టు క్యాబిన్‌ కూడా కదిలేలా ఓ ఫిక్స్‌డ్‌ బేస్‌కు అమరుస్తారు. దీన్ని సాధారణంగా పైలట్‌ ట్రైనింగ్‌లలో వాడుతారు. అదన్నమాట అందుకే సుషాంత్‌ విమానాన్ని నిజంగానే నడిపాడు అనేంతగా ఆ వీడియో ఉంది. సుశాంత్‌ పోస్ట్‌ చేసిన వీడియో గంటల వ్యవధిలోనే వైరల్‌గా మారింది. అంతేకాకుండా కామెంట్‌లలో అభిమానులు అడిగిన చాలా ప్రశ్నలకు సుశాంత్‌ బదులిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *