హీరో స్పీడుకి.. కళ్లెం వేసిన ఇన్‌స్టాగ్రామ్‌

బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌కు ఓ చిక్కొచ్చిపడింది. అదేంటంటే అతని స్పీడే అతనికి ఇబ్బందిని తెచ్చిపెడుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎప్పుడు యాక్టివ్‌గా ఉండే సుషాంత్‌ తన అభిమానుల మెసేజ్‌లకు కూడా వెంటనే బదులిస్తూ ఉంటారు. సుషాంత్‌ తన అధికారిక అకౌంట్‌​ నుంచే మెసేజ్‌లు చేసినా ఇన్‌స్టాగ్రామ్‌​ తరచూ బ్లాక్‌ చేస్తుందట.

యు ఆర్‌ టెంపరరీ బ్లాక్‌డ్‌ అంటూ సుషాంత్‌కు వచ్చిన ఓ మెసేజ్‌ని తన ఇన్స్‌టాగ్రామ్‌లోనే పోస్ట్‌ చేశారు. చాలా ఫాస్ట్‌గా మెసేజ్‌లు చేస్తూ తమ ఫీచర్‌ని తప్పుడుగా వాడుతున్నారని ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి వచ్చిన అలర్ట్‌ మెసేజ్‌లో ఉంది. దీంతో తాత్కాలికంగా అకౌంట్‌ను బ్లాక్‌ చేస్తున్నట్టు అందులో ఉంది. తమ యూజర్లకు కంటెంట్‌ విషయంలోనూ, కొన్ని పనులపై పరిమితులు ఉన్నాయని ఉంది. మేమేదైన తప్పు చేసుంటే మాకు సమాచారం అందించండి అని కూడా ఆ మెసేజ్‌లో ఉంది.

దీంతో సషాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ సదరు స్క్రీన్‌ షాట్‌ను ఇన్‌స్ట్రాగ్రామ్‌లోనే పోస్ట్‌ చేసి.. చాలా సార్లు నా అకౌంట్‌ను ఎందుకు బ్లాక్‌ చేస్తున్నారంటూ ఇన్‌స్ట్రాగ్రామ్‌ను ట్యాగ్‌ చేశారు. ఇది నా అకౌంటే, నా ఫ్రెండ్స్‌కు రీప్లై ఇస్తున్నా. అవును ఒక్క నిమిషంలోనే ఎక్కువ రిప్లైలు ఇస్తున్నా. నేను సమర్థున్ని .. అయితే సమస్య ఏంటి… అంటూ మెసేజ్‌ పెట్టారు. ఈ మెసేజ్‌ కాస్తా ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *