ప్రజల సేవలో ప్రగతి భారత్ ట్రస్టు.. ఆదుకుంటున్న విజయసాయిరెడ్డి

మాట్లాడే మాటల కన్నా.. చేసే చేతులు మిన్న అంటారు పెద్దలు.. ఇప్పుడు వైసీపీ సీనియర్ నాయకులు, ఎంపీ విజయసాయిరెడ్డి కరోనా వేళ లాక్ డౌన్ తో ఇబ్బందులు పడుతున్న ఉత్తరాంధ్ర ప్రజలకు అండగా నిలిచారు. పేదలు, గిరిజనులు, పారిధుధ్య కార్మికులు, పోలీసులు, హోంగార్డులు, జర్నలిస్టులకు సైతం నిత్యావసర సరకులు అందిస్తూ గొప్ప మనసు చాటుకున్నారు.

ఒడిషా సరిహద్దుల్లో ఆకలితో అలమటిస్తున్న గిరిజనులకు విజయసాయిరెడ్డి ‘ప్రగతి భారత్ ’ ట్రస్ట్ అండగా నిలిచి వారికి ఆకలి తీరుస్తోంది. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ పట్నం జిల్లాల్లో పేదలు, పోలీసులు, జర్నలిస్టులు, పారిశుధ్య కార్మికులకు తాజాగా విజయసాయిరెడ్డి ప్రగతి భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచితంగా నిత్యావసర సరుకులు అందించారు. విశాఖలో చిక్కుకుపోయిన ఇతర రాష్ట్రాల వారికి భోజన సదుపాయం కల్పించారు.

విశాఖలో 7500 మంది పారిశుధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు విజయసాయిరెడ్డి. 15వేల మంది వలంటీర్లకు శానిటైజర్లు, మాస్క్ లను తమ ట్రస్ట్ తరుఫున పంపిణీ చేస్తున్నామని తెలిపారు.

ఇక విశాఖలో కరోనా వేల కష్టపడుతున్న పారిశుధ్య కార్మికుల సేవలు గుర్తించిన ప్రగతి భారత్ ఫౌండేషన్ తాజాగా వారికి 1000 రూపాయల విలువైన నిత్యావసర సరుకులను పంపిణీ చేసి తన ఉదారత చాటుకుంది. ఇక విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలోనూ పేదలు, పారిశుధ్య కార్మికులకు ఈ సరుకులు పంపిణీ చేశారు. ఆంధ్రా సరిహద్దున ఉన్న గిరిజన కుటుంబాలకు అందజేశారు.

తక్కువ ఆర్థిక వనరులు ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలోని నిరుపేద కుటుంబాలను ఆదుకుంటున్నారు. ఇప్పుడు అదే బాటలో ప్రగతి భారత్ ట్రస్ట్ తరుఫున అన్నార్థుల ఆకలి తీరుస్తూ విజయసాయిరెడ్డి కూడా గొప్ప మనసు చాటుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *